కాంగ్రెస్‌‌కు సుప్రీం షాక్: అసెంబ్లీ రద్దుపై డికె అరుణ పిటిషన్ కొట్టివేత

By narsimha lodeFirst Published Oct 26, 2018, 3:29 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి డికె  అరుణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.  

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి డికె  అరుణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.  ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోకుండానే అసెంబ్లీని రద్దు  చేయడాన్ని తప్పుబడుతూ డికె అరుణ సుప్రీంకోర్టును  ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ రద్దును ఏకపక్షంగా చేశారని... మెజారిటీ ఎమ్మెల్యేల  అభిప్రాయాలను కూడ తీసుకోలేదని  పిటిషన్‌లో  ఆమె పేర్కొన్నారు.. అయితే ఈ పిటిషన్‌ను శుక్రవారం నాడు కొట్టేసింది. ఇదే పిటిషన్‌‌ను గతంలో హైకోర్టు కూడ కొట్టేసిన విషయం తెలిసిందే.

ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే  తుది ఓటర్ల జాబితా విడుదల  చేసిన తర్వాత కూడ జాబితాలో సవరణలు  చేసుకోవచ్చని కూడ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అసెంబ్లీ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై 200 పిల్స్ దాఖలు

30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్

click me!