రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరైంది కాదని సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించింది.తెలుగు రాష్ట్రాల్లోని కేసులు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలతో అరెస్టైన ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారంనాడు విచారణ జరిపింది. తమను రిమాండ్ చేయడాన్ని సుప్రీంకోర్టులో ఈ ముగ్గురు నిందితులు సవాల్ చేశారు.
ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై కింది కోర్టులో విచారణ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ తరపున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదావేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేసిందlr తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఈ నెల 4వ తేదీన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణ పూర్తైన తర్వాత కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు తొలుత రిమాండ్ ను తిరస్కరించిన విషయాన్ని న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.ఆ తర్వాత హైకోర్టు కింది కోర్టు తీర్పుకు భిన్నంగా ముగ్గురికి రిమాండ్ విధించింది. కేసులో మెరిట్స్ ను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పును వెల్లడించిందని నిందితుల తరపు న్యాయవాది ఈ నెల 4న వాదించారు.
also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: నిందితుల పిటిషన్ పై విచారణ ఈ నెల 7కి వాయిదా
గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి ,సింహయాజీ, నందకుమార్ లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యేరేగా కాంతారావు ,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు నిందితులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపించింది. దీని వెనుక బీజేపీ ఉందని కూడ గులాబీ పార్టీ తెలిపింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ విషయమై ఆడియో, వీడియోలను కూడ టీఆర్ఎస్ విడుదల చేసింది.