
కొత్తగూడెం: Bhadradri Kothagudem జిల్లా Manuguru ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్ధులపై గురువారం నాడు Honey bee దాడి చేశాయి. విద్యార్ధులతో పాటు Exam Center కేంద్రం వద్ద ఉన్న పేరేంట్స్, కాలేజీ సిబ్బందిపై తేనేటీగలు దాడి చేశాయి. పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇవాళ Intermediate సెకండియర్ పరీక్షలు రాసేందుకు మణుగూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గల పరీక్షా కేంద్రానికి విద్యార్ధులు చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే సమయంలో కాలేజీ ఆవరణలో ఉన్న తేనేటీగలు దాడి చేశాయి. పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్ధులు, పరీక్షా కేంద్రం వద్ద ఉన్న సిబ్బంది, అక్కడే ఉన్న పేరేంట్స్ పై దాడి చేశాయి. ఈ ఘటనలో Pravalika, Vishnu vardhanఅనే ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ కే తేనేతుట్టె ఉంది. అయితే తేనేతుట్టెను తొలగించని కారణంగా ఇవాళ ఘటన చోటు చేసుకుందని విద్యార్ధులు చెబుతున్నారు.