అధికారుల పొరపాటు.. విద్యార్ధినికి శిక్ష: నీట్ రాయకుండా కన్నీళ్లతో బయటకు..

By Siva KodatiFirst Published Sep 13, 2020, 6:48 PM IST
Highlights

నిర్వాహకుల ఘనకార్యం కారణంగా ఓ విద్యార్దిని జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాయకుండా కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది.  

నిర్వాహకుల ఘనకార్యం కారణంగా ఓ విద్యార్దిని జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాయకుండా కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది.  

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన నిఖాత్ ఫాతిమా అనే విద్యార్ధిని నీట్ పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులతో కలిసి అద్దె కారులో వరంగల్ జిల్లా హన్మకొండకు వచ్చింది.

హాల్ టికెట్‌లో పరీక్షా కేంద్రం చిరునామా ఏవీవీ కళాశాల, వరంగల్ అని ఉండటంతో అక్కడికి వెళ్లింది. అయితే అక్కడ ఎలాంటి పరీక్షా కేంద్రం లేదని తెలియడంతో అవాక్కయ్యింది.

అధికారుల తప్పిదంతోనే తాను పరీక్ష రాయలేకపోయానంటూ ఉద్వేగానికి గురైన ఆ విద్యార్ధిని కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుదిరిగింది.

అనంతరం తనకు న్యాయం చేయాలని కోరుతూ హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై ఫాతిమా ఫిర్యాదు చేసింది. 

click me!