ఇబ్రహీంపట్నంలో విద్యార్ధులపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు: ఒకరు మృతి, మరొకరికి గాయాలు

Published : Sep 13, 2022, 11:16 AM ISTUpdated : Sep 13, 2022, 11:35 AM IST
 ఇబ్రహీంపట్నంలో విద్యార్ధులపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు:  ఒకరు మృతి, మరొకరికి గాయాలు

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో   స్కూల్ బస్సు ఢీకొనడంతో  ఇకరు మరణించారు. మరో విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలోని  ఇబ్రహీంపట్నంలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్ధులపై స్కూల్ బస్సు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఒక విద్యార్ధి మరణించారు. మరొకరు గాయపడ్డారు. . బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. డ్రైవర్ బస్సును అక్కడే వదిలి పారిపోయాడు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఃఠాయించి ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. 

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుననాయి. నిన్ననే చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రాష్ట్రంలోని కోర్సా జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొనంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణమైన బస్సు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును తప్పించబోయి ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. నిన్న మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్