త్వరలో డీఎస్సీ ... ప్రకటన నెంబర్ 420

First Published Mar 20, 2017, 10:35 AM IST
Highlights
  • మూడేళ్ల నుంచి ప్రకటనలకే పరిమితమైన డీఎస్సీ  నోటిఫికేన్

నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగానే తెలంగాణ పోరు సాగింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఇంటి పార్టీగా చెప్పుకొనే టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. వచ్చిరావడంతోనే  తెలంగాణ యువకుల బంగారు కలల సాకారం దిశగా అడుగులు వేస్తామని గొప్పలు చెప్పింది. అధాకరంలోకి రాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చింది.

 

అలా ఉపఎన్నికలు, ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికల్లోనూ గట్టెక్కింది. కానీ, మూడేళ్ల పాలనలో టీఆరఎస్ పార్టీ ఒక్క ఉపాధ్యాయ నియామక పరీక్షపైనే బోలేడు ప్రకటనలు చేసింది. వందల సార్లు హామీలు ఇచ్చింది.

 

డీఎస్సీ కి ఉండే పోటీ అంతా ఇంతా కాదు. అందుకే దాన్ని తెలుగు సివిల్స్ అంటుంటారు. అలాంటి టీచర్ పోస్టుల ప్రకటన కోసం అభ్యర్థులు ఐదేళ్లుగా వేచిచూస్తున్నారు.

సర్కారు మాత్రం ఇదిగో డీఎస్సీ అంటూ ప్రకటనలకే ఇన్నాళ్లు పరిమితమైంది తప్పితే చిత్తశుద్దితో నియామకాలపై ఒక్కసారి కూడా దృష్టిసారించలేదు.

అసలు డీఎస్సీ భర్తీ ప్రక్రియే ఇప్పుడో ప్రవహసనంగా మారింది. బీఎడ్ చేయాలి.. టెట్ లో క్వాలిఫై అవ్వాలి ఆ తర్వాత గట్టి పోటీ ఉండే డీఎస్సీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి.

అయినా అభ్యర్థులకు ఈ పరీక్షలేవీ కష్టంగా కనిపించడం లేదు. సర్కారు చెబుతున్న ఊరించే ప్రకటనలే వాళ్లకు పెద్ద పరీక్షగా కనిపిస్తున్నాయి.

ఇన్నాళ్లుగా సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నుంచి ఎమ్మెల్యే వరకు డీఎస్సీ పై చేసిన ప్రకటనలు లెక్కపెడితే వందలు దాటి ఉంటాయి.

 

ఇదంతా పక్కన పెడితే డీఎస్సీ వాయిదాకు ప్రభుత్వ చెబుతున్న సాకులు మరీ విచిత్రంగా ఉన్నాయి.

 

కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే  డీఎస్సీ నియామకం ఆలస్యమైందని ఒకసారి. టీఎస్ పీయస్సీకి పరీక్ష అప్పగించడం వల్లే ఆలస్యమవుతోందని మరోసారి. గురుకుల పాఠశాల నోటిఫికేషన్ వేసినందువల్ల ఆలస్యం అవుతోందని ఇంకోసారి ఇలా నోటికొచ్చిన సాకులన్నీ చెబుతూనే ఉంది.

 

ఈ సాకులను 2019 ఎన్నికల ముందు వరకు తీసుకొచ్చి అప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని గులాబీ సర్కారు వ్యూహం అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు.  అదే నిజమైతే ఇక అప్పటి వరకు డీఎస్సీ వచ్చే చాన్సే లేదు.

click me!