గోవా సన్ బర్న్ షోలో తొక్కిసలాట... హైదరాబాద్ యువకుడు మృతి

Published : Dec 31, 2019, 10:18 AM IST
గోవా సన్ బర్న్ షోలో తొక్కిసలాట... హైదరాబాద్ యువకుడు మృతి

సారాంశం

తొక్కిసలాటలో కిందపడిపోయి సాయిప్రసాద్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు తెలుస్తోంది. కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఆకస్మికంగా దూరమయ్యాడని తండ్రి కార్తీక్‌గౌడ్‌ అన్నారు. 


గోవా సన్ బర్న్ షోలో జరిగిన తొక్కిసలాటలోనే తన కుమారుడు చనిపోయి ఉంటాడని కొత్తపేటకు చెందిన కార్తీక్ గౌడ్ అభిప్రాయపడ్డారు. న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా ఇటీవల గోవాలో సన్ బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ షో ఏర్పాటు  చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో నగరానికి చెందిన సాయి ప్రసాద్ అనే యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

కాగా... సంబరాల్లో భాగంగా గోవా వెళ్లిన కుమారుడు ఇంటికి శవమై రావడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సాయిప్రసాద్‌, అతడి స్నేహితుడు చిన్నవెంకట్‌ ఎలకాట్రానిక్‌ డాన్స్‌ మ్యూజిక్‌ కార్యక్రమాన్ని వీక్షించేందుకు క్యూలో నిలబడి ఉండగా దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. 

తొక్కిసలాటలో కిందపడిపోయి సాయిప్రసాద్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు తెలుస్తోంది. కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఆకస్మికంగా దూరమయ్యాడని తండ్రి కార్తీక్‌గౌడ్‌ అన్నారు. 

కుటుంబానికి ఆసరాగా ఉండే చెట్టంత కొడుకు దూరం కావడం సాయిప్రసాద్‌ కుటుంబం షాక్‌కు గురయిందని ఇరుగుపొరుగు వారు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం సాయిప్రసాద్‌ పెద్ద సోదరి మాధురి చనిపోయిందన్నారు. అతడి చిన్నక్క మంజరి అమెరికాలో ఉంటుందన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు