స్కూల్ స్టూడెంట్స్ ఆటోని ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి

Published : Dec 31, 2019, 09:36 AM ISTUpdated : Dec 31, 2019, 10:10 AM IST
స్కూల్ స్టూడెంట్స్ ఆటోని ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి

సారాంశం

 ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు స్కూల్ ముందే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఉప్పల్ లో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ వద్ద విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

 మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు స్కూల్ ముందే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

అత్యంత వేగంగా లారీ దూసుకురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన ఓ విద్యార్థిని  మొయినుద్దీన్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులు భాష్యం స్కూల్ కి చెందినవారుగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్
మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu