పది ఆసుపత్రులు తిరిగినా కనికరించలేదు: మహిళా మృతి, హెచ్ఆర్‌సీలో పిటిషన్

By narsimha lodeFirst Published Jun 19, 2020, 6:10 PM IST
Highlights

జలుబు, నీరసంతో ఉన్న ఓ మహిళను చేర్చుకొనేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరించాయి. గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరకు గాంధీ ఆసుపత్రిలో చేరే సమయానికి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం  హెచ్ఆర్‌సీని ఆశ్రయించింది.
 

హైదరాబాద్: జలుబు, నీరసంతో ఉన్న ఓ మహిళను చేర్చుకొనేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరించాయి. గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరకు గాంధీ ఆసుపత్రిలో చేరే సమయానికి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం  హెచ్ఆర్‌సీని ఆశ్రయించింది.

హైద్రాబాద్ కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య  రోహితకు జలుబు, జ్వరంతో ఇబ్బంది పడింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లాడు.

కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమెను ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరించాయి. దాదాపుగా  గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఫలితం లేకపోవడంతో చివరకు ఆయన గాంధీ  ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

10 ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. కానీ ఆమెను చేర్చుకోలేదు.  గంటల సమయం గడిచిపోయింది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మృతి  చెందింది.

కరోనా రోగి అంటూ ఆసుపత్రుల్లో ఆమెను చేర్చుకోకపోవడంతోనే తన భార్య చనిపోయిందని భర్త శ్రీకాంత్ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

గతంలో కూడ తెలంగాణ రాష్ట్రంలో గద్వాలలో గర్భిణీని రెడ్ జోన్ నుండి వచ్చిందని డెలీవరీ కోసం ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో డెలీవరీ అయిన కొద్దిసేపటికే తల్లీ బిడ్డ ఆమె మరణించిన విషయం తెలిసిందే. 

click me!