ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో శ్రీకాంత్ కుటుంబసభ్యుల ధర్నాను విరమించారు. సుమారు 20 గంటల పాటు ఈ ఆందోళన చేశారు
బోదన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ధర్నాను విరమించారు. మూడు మాసాల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం నుండి మంగళవారంనాడు తెల్లవారుజాము ఐదు గంటలవరకు ఆందోళన నిర్వహించారు. ఇవాళ ఉదయం శ్రీకాంత్ కుటుంబ సభ్యులలు ఆందోళనను విరమించారు.
బోధన్ కు శివారులోని పసుపువాగు వద్ద కుళ్లిన స్థితిలో శ్రీకాంత్ మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. చెట్టుకు వేలాడుతూ ఈ డెడ్ బాడీ ఉంది. బోధన్ మండలం ఖండేగావ్ కు చెందిన శ్రీకాంత్ కు చెందిన డెడ్ బాడీగా పోలీసులు గుర్తించారు. మూడు మాసాల నుండి శ్రీకాంత్ అదృశ్యమయ్యారు . ప్రేమ విషయంలో శ్రీకాంత్ కన్పించకుండా పోయాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ను హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై శ్రీకాంత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం నుండి ఆందోళనను ప్రారంభించారు.
undefined
also read:బోధన్ శివారులో కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం.. అదే కారణమా..?
మూడు మాసాలుగా శ్రీకాంత్ ఆచూకీ లభ్యం కాలేదు.ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. అయినా కూడా శ్రీకాంత్ ఎక్కడా ఉన్నట్టుగా కూడా సమాచారం రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అయితే శ్రీకాంత్ డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో నిన్న గుర్తించారు. శ్రీకాంత్ కు చెందిన పుస్తకాలను డెడ్ బాడీ దొరికిన చోటే లభించాయి. అయితే శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసి ఉరేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి కుటుంబసభ్యులు గతంలో బెదిరింపులకు పాల్పడినట్టుగా బాధిత కుటుంబసభ్యులు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆందోళనను విరమించాలని పోలీసులు కోరారు.