‘‘నాకు టికెట్ ఇవ్వకుంటే.. సూసైడ్ చేసుకుంటా’’

By ramya neerukondaFirst Published Sep 8, 2018, 11:51 AM IST
Highlights

నాకు కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే.. ఆత్మహత్య చేసుకుంటానని  దాసోజు శంకరమ్మ మీడియాకు తెలిపారు.

ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలగాణ అసెంబ్లీని రద్దు చేసి.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు కేసీఆర్. ఇప్పడు అదే ఆయనకు తలనొప్పిగా మారినట్టు కనపడుతోంది. టికెట్ దక్కిన వారంతా హ్యాపీ గానే ఉన్నారు. దక్కనివారే.. పార్టీ అధిష్టానాన్ని బెదిరించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే టికెట్ ఆశించి భగపడిన కొందరు నేతలు మీడియా ముందు తమ అసహాన్ని వెల్లగక్కగా.. తాజాగా మరొకరు ఈ జాబితాలో చేరారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి.. అందులో భాగంగా ప్రాణాలు విడిచిన శ్రీకాంతా చారి తల్లి.. తనకు సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.  ‘‘నన్ను కాదని వేరేవారికి టికెట్‌ ఇస్తే పది నిమిషాల్లో నా ప్రాణం పోతుంది’’ అని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, శ్రీకాంతాచారి తల్లి దాసోజు శంకరమ్మ అన్నారు.

ఎన్‌ఆర్‌ఐల పేరుతో వేరొకరికి ఇస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ సీటు తనకే ఇస్తామని హామీ ఇచ్చారని, దాని ప్రకారం న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. శంకరమ్మకే టికెట్‌ ఇవ్వాలంటూ వీరాంజనేయులు (మిర్యాలగూడ), నాగు (హూజూర్‌నగర్‌) అనే ఇద్దరు యువకులు హైదరాబాద్‌లో రేడియో స్టేషన్‌ టవర్‌ ఎక్కారు

click me!