శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ బీఎస్ రావు కన్నుమూత

Published : Jul 13, 2023, 04:42 PM ISTUpdated : Jul 13, 2023, 04:57 PM IST
శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ బీఎస్ రావు కన్నుమూత

సారాంశం

శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు.


శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. బీఎస్ రావు హైదరాబాద్‌లోని నివాసంలో బాత్‌రూమ్‌లో జారిపడి తీవ్రంగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.  ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విజయవాడకు తరలిస్తున్నారు. రేపు విజయవాడలో బీఎస్‌ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, గత కొంతకాలంగా బీఎస్ రావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Also Read: మనవాళ్లే సందేహిస్తున్నారు: బీ టీమ్ వ్యాఖ్యలపై పవన్ సంచలనం..

ఇక, బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. బీఎస్ రావు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభించారు. ఆ తర్వాత నెమ్మదిగా పలు ప్రాంతాలకు శ్రీచైతన్య విద్యాసంస్థలను విస్తరించారు. శ్రీచైతన్య విద్యాసంస్థలను ఇంటర్, ఎంసెట్‌‌కు కేరాఫ్‌గా మార్చారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య విద్యా సంస్థలకు 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్