మాదాపూర్‌‌లో కారు బీభత్సం.. వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో..

Published : Oct 08, 2022, 10:01 AM ISTUpdated : Oct 08, 2022, 10:04 AM IST
మాదాపూర్‌‌లో కారు బీభత్సం.. వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో..

సారాంశం

హైదరాబాద్ మాదాపూర్‌‌లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

హైదరాబాద్ మాదాపూర్‌‌లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మాదాపూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో మెట్రో పిల్లర్ నెంబర్ 1,726 వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన  తీరును పరిశీలించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం అయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!