చిన్న పిల్లాడిలా మారి... పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 25, 2021, 03:18 PM ISTUpdated : Aug 25, 2021, 03:20 PM IST
చిన్న పిల్లాడిలా మారి... పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం (వీడియో)

సారాంశం

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన హోదాను సైతం పక్కనపెట్టి చిన్న పిల్లాడిలా మారి దేశాయిపేట గల్లీల్లో సరదాగా క్రికెట్ ఆడారు. 

బాన్సువాడ: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్నారులంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఎక్కడయినా చిన్నారులు కనిపిస్తే చాలు వెంటనే ఆయన కాన్వాయ్ ఆగిపోతుంది. వారితో సరదాగా గడపడమే కాదు తన హోదాను పక్కనపెట్టి చిన్న పిల్లాడిలా మారిపోతారు. తాజాగా పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు.  

బుధవారం స్పీకర్ పోచారం తన సొంత నియోజకవర్గం బాన్సువాడలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో చిన్నారులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇంకేముంది స్పీకర్ లోని చిన్నపిల్లాడు కూడా మేల్కొన్నారు. వెంటనే తన కారుని ఆపిన స్పీకర్ చిన్నారులతో సరదాగా క్రికెట్ ఆడారు. 

వీడియో

చిన్నారుల నుండి బ్యాట్ అందుకున్న స్పీకర్ పోచారం కాస్సేపు తన స్టైల్లో బ్యాటింగ్ చేశారు. చిన్నారులు బౌలింగ్ లో బ్యాటింగ్ అదరగొట్టారు. ఇక పెద్దాయన తమతో క్రికెట్ ఆడటంతో చిన్నారుల సంతోషానికి అవధులు లేవు. ఇలా ఎంత పెద్ద హోదాలో ఉన్నా చిన్నారులతో సరదాగా గడపడం స్పీకర్ పోచారంకి మాత్రమే సాద్యం.

 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?