హైద్రాబాద్‌లో దారుణం: ఆస్తులు పంచుకొని తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు

By narsimha lodeFirst Published Aug 4, 2020, 1:20 PM IST
Highlights

ఆస్తులు పంచుకొని కన్నతల్లిని రోడ్డుపైనే వదిలిపెట్టారు కొడుకులు. రాత్రి నుండి రోడ్డుపైనే ఆమె పడిగాపులు కాస్తోంది. తన దీనస్థితికి ఆమె కుమిలి ఏడుస్తోంది.
 


హైదరాబాద్: ఆస్తులు పంచుకొని కన్నతల్లిని రోడ్డుపైనే వదిలిపెట్టారు కొడుకులు. రాత్రి నుండి రోడ్డుపైనే ఆమె పడిగాపులు కాస్తోంది. తన దీనస్థితికి ఆమె కుమిలి ఏడుస్తోంది.

హైద్రాబాద్ అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ లోని జైశ్వాల్ గార్డెన్ ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. కమలమ్మ అనే 70 ఏళ్ల వృద్దురాలికి పక్షపాతం వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. కొంత కాలం క్రితం భర్త సత్యనారాయణ అనారోగ్యంతో మరణించాడు.

భర్త మరణించిన తర్వాత పిల్లలు ఆస్తులు పంచుకొన్నారు. కోట్లాది రూపాయాల ఆస్తిని పంచుకొన్నారు. పక్షవాతం వచ్చిన కమలమ్మను చూసుకొనేందుకు నిరాకరించారు.  అయితే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం నాడు రాత్రి కమలమ్మను రోడ్డుపైనే వదిలి వెళ్లారు కొడుకులు.

రాత్రి నుండి ఆమె రోడ్డుపైనే ఏడుస్తూ కూర్చొంది. ఆమె వద్దే ఆమె ఉపయోగించే వస్తువులు, బట్టలను కూడ వదిలివెళ్లారు. తనను రోడ్డుపైనే వదిలి వేయడంపై కమలమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తనలాంటి పరిస్థితి మరెవరికి కూడ రావొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయాం చేయాలని బాధితురాలు కోరుతోంది.


 

click me!