కన్నకొడుకే కాలయముడు.. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తండ్రిని చితకబాది... దారుణం..

By SumaBala Bukka  |  First Published Mar 28, 2022, 10:29 AM IST

డబ్బులు ఇవ్వలేదని ఓ కన్నకొడుకు దారుణానికి తెగబడ్డాడు. కన్నతల్లిమీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు, అడ్డువచ్చిన తండ్రిని కర్రతో చితకబాదాడు. 


దుబ్బాక :  కన్నకొడుకే కాలయముడు అయ్యాడు. money ఇవ్వలేదని అక్కసు పెంచుకుని motherకి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు.  అడ్డువచ్చిన తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా attack చేశాడు. ఈ విషాద ఘటన siddipet, జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందపూర్ లో చోటు చేసుకుంది.  గోవిందా పూర్ కి చెందిన  మైసయ్య(65), పోశవ్వ (60) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

గతంలో చిన్న కుమారుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. వీరందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మైసయ్య తనకున్న మూడు గుంటల భూమిని అమ్మగా, రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బులో లక్ష బాలమల్లుకు ఇచ్చి తన వద్ద రూ.లక్ష  ఉంచుకున్నాడు. ఆ డబ్బు కూడా ఇవ్వాలంటూ బాలమల్లు తల్లిదండ్రులతో శనివారం గొడవపడ్డాడు. 

Latest Videos

undefined

ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరం ఉందని మైసయ్య ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోలేదు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి తల్లిని తీవ్రంగా చితకబాది ఆమె దగ్గర ఉన్న డబ్బుల సంచిని లాక్కున్నాడు.  ఆ తర్వాత బైక్ లోంచి పెట్రోల్  తీసి.. తల్లిపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలకు గురైన పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి  మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

బాలమల్లు కర్రతో తండ్రిపై కూడా దాడి చేసి గాయపరిచారు. గ్రామస్తులు 108లో వీరిద్దరిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో  ఆమెకు  మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణ ఘటనే మార్చి10న చౌటుప్పల్ లో జరిగింది. పోషణ విషయంలో కన్నబిడ్డలే ఈసడించడం mother ప్రాణం మీదికి తెచ్చిన విషాదం ఇది. చౌటుప్పల్ inspector ఎన్.శ్రీనివాస్ కథనం ప్రకారం..  యాదాద్రి జిల్లా Choutuppal మండలం జైకేసారాం  గ్రామానికి చెందిన స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, రవి. పెద్ద కుమారుడు నాగరాజు రాళ్లు పగలకొట్టి జీవనం సాగిస్తున్నాడు. చిన్నవాడైన రవి లారీడ్రైవర్ గా పనిచేస్తూ వేరే ఊరిలో నివసిస్తున్నాడు. తల్లిదండ్రుల పోషణ విషయంలో  వీరిద్దరూ తరచూ తగాదాలు  పడేవారు.

పెద్దకుమారుడు తాగి వచ్చి ఘర్షణకు దిగేవాడు. ఒకటి రెండుసార్లు ఇంట్లో నుంచి గెంటివేశాడు. పలుమార్లు ఊర్లో పెద్దలు పంచాయతీ పెట్టి  మందలించినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి మరోసారి  ఇలా జరగడంతో ఆవేదన చెందిన ఆండాలు బుధవారం ఉదయంఈ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని… చనిపోతానని అంటూ రోడ్డుమీదకు వచ్చి ఆవేదన చెందడంతో సర్పంచు, తదితరులు నచ్చజెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. దీంతో ఆమె చౌటుప్పల్ పోలీసులను ఆశ్రయించారు.  

వారు ఇద్దరు కుమారులను స్టేషన్ కు పిలిపించి విచారించారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఆండాలు (55) కుమారుల వైఖరికి మనస్థాపం చెంది ఠాణా బయట చెట్టు చాటుకు వెళ్ళి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. పోలీస్ అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగరాజు ఆండాళుతో మాట్లాడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. భువనగిరి డిసిపి నారాయణరెడ్డి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.

click me!