కరీంనగర్ లో అమానుషం... ఆస్తి కోసం కన్నతల్లినే కొట్టిచంపిన కసాయి కొడుకు (వీడియో)

Published : Aug 02, 2023, 02:15 PM ISTUpdated : Aug 02, 2023, 02:20 PM IST
కరీంనగర్ లో అమానుషం... ఆస్తి కోసం కన్నతల్లినే కొట్టిచంపిన కసాయి కొడుకు (వీడియో)

సారాంశం

ఆస్తి కోసం కన్నతల్లినే అతి దారుణంగా కొట్టించంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణం  ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. 

కరీంనగర్ : నవమాసాలు కడుపున మోసి ప్రాణంపోసిన తల్లి ప్రాణాలు తీసాడు ఓ కసాయి కొడుకు. తల్లిపై ప్రేమ లేకున్నా వృద్దురాలన్న కనీస జాలి చూపించకుండా అందరూ చూస్తుండగానే కొట్టిచంపాడు దుర్మార్గుడు. మానవ సంబంధాలకే మచ్చలాంటి ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ(60) ముగ్గురు కూతుర్ల, ఓ కొడుకు సంతానం. పిల్లలందరికీ పెళ్లిళ్లయి ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో వ్యవసాయ భూమి కనకవ్వ పేరిట వుంది. ఈ భూమి విషయంలోనే కొడుకు, కూతుళ్లకు మధ్య వివాదం సాగుతోంది. తల్లి కనకవ్వ కూడా కూతుళ్లకే మద్దతిస్తోందని కోపం పెంచుకున్న కొడుకు దారుణానికి ఒడిగట్టాడు.

వీడియో 

భూమి విషయమై ఇవాళ మరోసారి కనకవ్వ పిల్లల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తల్లి కూతుళ్లవైపు మాట్లాడుతోందని కోపంతో రగిలిపోయిన కొడుకు చేతిలోని పారతో దాడిచేసాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కనకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది. 

Read More   బాచుపల్లి రోడ్డులో గుంతలకు చిన్నారి బలి.. స్కూల్ బస్సు కిందపడి మృతి..

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కనకవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిని చంపిన నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu