మద్యానికి డబ్బులివ్వలేదని.. కన్నతల్లినే కడతేర్చాడు..

Published : May 15, 2021, 09:45 AM IST
మద్యానికి డబ్బులివ్వలేదని.. కన్నతల్లినే కడతేర్చాడు..

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లా... ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు.

రాజన్న సిరిసిల్ల జిల్లా... ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు.

మద్యం మనుషుల్లో విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. వావివరసలు మరిచిపోయేలా చేస్తుంది. అనుబంధాల్ని కాలరాస్తుంది. ఆ సమయానికి మద్యం తాగాలన్న కోరిక నిలువనీయక మనుషుల్ని మృగాలుగా మార్చేస్తుంది. 

ఇలాంటి దారుణ ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడో కొడుకు. తన దగ్గర డబ్బులు లేవంటూ ఆ తల్లి సమాధానం ఇచ్చింది. అంతే పట్టరాని ఆగ్రహంతో దారుణానికి ఒడిగట్టాడు. 

గతరాత్రి తల్లి కలకొండ వసంతను మద్యం తాగడానికి డబ్బులు కావాలని అడిగాడు కొడుకు రంజిత్ రావు.  అయితే తల్లి వసంత తన దగ్గర డబ్బులు లేవనడంతో.. తల్లి తలపై బలంగా కొట్టాడు రంజిత్. దీంతో వసంత అక్కడికక్కడే మృతి చెందింది.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కొడుకు రంజిత్ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మీద దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా