పార్టీలో చేరితే ఇళ్లు, ఫ్లాట్లు .. అమాయకులకు జై భారత్ పార్టీ పేరుతో వల, క్యూకట్టిన మహిళలు

Siva Kodati |  
Published : Jul 05, 2022, 06:37 PM ISTUpdated : Jul 05, 2022, 06:40 PM IST
పార్టీలో చేరితే ఇళ్లు, ఫ్లాట్లు .. అమాయకులకు జై భారత్ పార్టీ పేరుతో వల, క్యూకట్టిన మహిళలు

సారాంశం

తమ పార్టీలో చేరితో ఇళ్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ జై భారత్ పార్టీ పేరుతో కొందరు పేదలకు వల వేస్తున్నారు. దీనిని నిజమేనని నమ్మి ఆధార్ కార్డ్, రెండు పాస్ పోర్టు ఫోటోలు తీసుకుని క్యూ కడుతున్నారు ఆడపడుచులు.

జై మహా భారత్ పార్టీ పేరుతో అమాయక ప్రజల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. పేద ప్రజలకు ఇళ్లు, ఫ్లాట్లు ఇస్తామని బస్తీల్లో ప్రచారం చేస్తోంది ఈ ముఠా. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర భారతి పక్కన ఓ ప్రైవేట్ భవనం వద్దకు భారీగా చేరుకున్నారు మహిళలు. ఒక ఆధార్ కార్డ్ , రెండు ఫోటోలు తీసుకుని ఆ పార్టీ రసీదును ఇచ్చి పంపిస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అటుగా వెళ్తున్న వాహనదారులు మండిపడుతున్నారు. అమాయక పార్టీలను మోసం చేస్తున్న జై భారత్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu