కేసీఆర్‌కు షాక్: టీఆర్ఎస్‌కు సోమారపు సత్యనారాయణ రాజీనామా

Published : Jul 09, 2019, 11:28 AM ISTUpdated : Jul 09, 2019, 12:32 PM IST
కేసీఆర్‌కు షాక్: టీఆర్ఎస్‌కు సోమారపు సత్యనారాయణ రాజీనామా

సారాంశం

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.  


గోదావరిఖని: మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో గోదావరిఖని నుండి సోమారపు సత్యనారాయణ  టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చందర్ విజయం సాధించాడు. ఆ తర్వాత చందర్  టీఆర్ఎస్‌లో చేరారు.

పార్టీలో తనకు తగిన గౌరవం లేదని  సోమారపు సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. మంగళవారం నాడు  గోదావరిఖనిలో మీడియాతో సోమారపు సత్యనారాయణ మాట్టాడారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీలో కలిసి పనిచేయడం సాధ్యం కావడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

గౌరవం లేదు: బాల్క సుమన్‌పై సోమారపు తీవ్ర ఆరోపణలు
 

PREV
click me!

Recommended Stories

చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?