దోమలగూడ గ్యాస్ లీకేజ్ ఘటన.. చిన్నారి మృతి, ఆరుగురి పరిస్థితి విషమంగానే

Siva Kodati |  
Published : Jul 12, 2023, 03:38 PM IST
దోమలగూడ గ్యాస్ లీకేజ్ ఘటన.. చిన్నారి మృతి, ఆరుగురి పరిస్థితి విషమంగానే

సారాంశం

హైదరాబాద్ దోమలగూడలో మంగళవారం గ్యాస్ లీకైన ఘటనలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.  ఆరుగురి పరిస్ధితి విషమంగా వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

హైదరాబాద్ దోమలగూడలో మంగళవారం గ్యాస్ లీకైన ఘటనలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దోమలగూడ రోజ్ కాలనీకి చెందిన బోయకర్ పద్మ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే బోనాల పండుగ కావడంతో కూతురు, అల్లుడు, బంధువులను ఇంటికి ఆహ్వానించింది. అందరూ సంతోషంగా పిండి వంటలు చేసుకుంటూ వుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఇళ్లు మొత్తం దగ్థమైంది.

ఆ సమయంలో ఇంట్లో వున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆనంద్, నాగమణి, పద్మ, ధనలక్ష్మీ, చిన్నారులు అభినవ్, శరణ్య, విహార్‌గా గుర్తించారు. వీరందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ చిన్నారి శరణ్య మృతి చెందగా.. ఆరుగురి పరిస్ధితి విషమంగా వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే