ఎన్నికల తర్వాత ఫ్రంట్‌లతోనే ఫలితాలు: సీతారాం ఏచూరి

By narsimha lodeFirst Published Jan 9, 2022, 4:04 PM IST
Highlights

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు మగిశాయి. శుక్రవారం నాడు హైద్రాబాద్ లో సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల్లో జాతీయ రాజకీయ పరిస్థితులపై ఆ పార్టీ చర్చించింది. 

హైదరాబాద్: ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన ఫ్రంట్‌లు పలితాలను ఇవ్వలేదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫ్రంట్‌లు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు..1996 నుండి 2004 వరకు ఏర్పడిన ఫ్రంట్‌ల గురించి సీతారం ఏచూరి వివరించారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన ఈసీని కోరారు.

cpm కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం నాడు ముగిశాయి. శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సీపీఎం దేశంలోని రాజకీయ పరిస్థితులతో పాటు ఐదు రాస్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసించాల్సిన వ్యూహంపై చర్చించారు. సీపీఎం జాతీయ కమిటీ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆదివారం నాడు హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో Sitaram Yechuryఏచూరి మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలోని bjp ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్  ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన చెప్పారు. దీంతో ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉందని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం మేరకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఏచూరి కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు Election Commission  నిర్ణయాలు తీసుకోవాలని ఏచూరి కోరారు. 

Election Code ను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా సీతారాం ఏచూరి ఈసీని డిమాండ్ చేశారు. డబ్బును ఉపయోగించుకొంటూ నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరగకుండా బీజేపీ అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు.

మూడు రోజుల పాటు నిర్వహించిన కేంద్ర కమటీ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను ఆమోదించామని సీతారాం ఏచూరి చెప్పారు.  ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాల ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు ఏచూరి. బీజేపీని వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే వారితో కలిసి ముందుకెళ్తామన్నారు. ప్రధానిగా మోడీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని మోడీ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలుంటాయని ఆయన చెప్పారు. 
 

click me!