టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై విచారణకు సిట్:హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్

By narsimha lode  |  First Published Nov 10, 2022, 4:04 PM IST


మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు  చేసిన  సిట్ పై హైకోర్టులో బీజేపీ  రిట్ పిటిషన్  దాఖలు చేసింది.ఇప్పటికే ఇదే కేసును ప్రత్యేక బృందంతో విచారించాలని బీజేపీ  హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలకు ప్రలోభా ల కేసును విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన  సిట్ పై  బీజేపీ గురువారంనాడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.దర్యాప్తును నిలిపివేయడంతో పాటు ,సిట్ ఏర్పాటును కూడా నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు.మొయినాబాద్ ఫాం కేసు విషయమై  ప్రత్యేక బృందంతో విచారణ చేయించాలని ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ కేసు పై విచారణ నిర్వహించిన హైకోర్టు విచారణను ఈ నెల 14కి వాయిదా వేసిన విషయం  తెలిసిందే.

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో విచారణపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది.దీంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేస్తూ నిన్న ఆదేశాలు జారీచేసింది. హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేయనుంది.నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి,సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్,  శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి,రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్,మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డిలున్నారు.అయితే సిట్ విచారణ;పైబీజేపీ రాష్ట్ర నేత ప్రేమేందర్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

Latest Videos

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణను బీజేపీ కోరుతుంది. నిందితుల విచారణపై స్టే ని బీజేపీ కోరింది.  అయితే విచారణపైస్టే రెండు  రోజుల క్రితం ఎత్తివేసింది.ఈ తరుణంలో  ఈ కేసు విచారణను సిట్ ఏర్పాటు చేయడంపై బీజేపీ ఈ  రిట్  పిటిషన్ ను దాఖలు చేసింది.

alsoread:మొయినాబాద్ ఫాంహౌస్‌ కేసు .. సిట్‌ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

గత నెల26 వతేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్  ఆరోపించింది.   రామచంద్రబారతి, సింహయాజీ,నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రలోభాల కేసుతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది.  రాష్ట్రంలోని కొందరు పోలీసుల తీరుపై బీజేపీ నేతలు అపనమ్మకం వ్యక్తం చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణను కోరారు. విచారణపై స్టేను కోర్టు ఎత్తివేయడంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటుచేసింది. తమ పార్టీని దోషిగా చేసేలా విచారణ జరిగే అవకాశం ఉందని బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో సిట్ ఏర్పాటుపై ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.ఈ కేసులో అరెస్టైన నిందితలు ముగ్గురు తమ అరెస్ట్ ను నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ సాగుతుంది.ఈ నెల 14వ తేదీకి విచారణ వాయిదా పడింది.

click me!