సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి: బెంగుళూరులో డెడ్‌బాడీ లభ్యం

By narsimha lodeFirst Published Nov 25, 2021, 10:55 AM IST
Highlights


ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం వారం రోజులుగా కన్పించకుండా పోయింది. హరిణి తండ్రి ఏకే రావు బెంగుళూరు రైల్వేట్రాక్ పై అనుమానాస్పదస్థితిలో మరణించాడు.

: ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం వారం రోజులుగా అదృశ్యమైంది. హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై లభించింది.వారం రోజులుగా హరిణి కుటుంబ సభ్యుల ఫోన్లు పనిచేయడం లేదు హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో ఏకే రావు తన కుటుంబంతో నివాసం  ఉంటున్నాడు. 
 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత AK Rao సుజనా పౌండేషన్ కు సీఈఓగా పనిచేస్తున్నారు. హరిణి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సింగర్ గా పేరు తెచ్చుకొంది. వారం రోజులుగా ఏకే రావు  Sujana Foundationకార్యాలయానికి రాలేదని అక్కడ పనిచేసేవారు చెప్పారు. అయితే  ఏకే రావు Bangloreలోని Railway track పై అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఏకే రావు ప్రమాదవశాత్తు రైలు నుండి పడి చనిపోయాడా లేదా ఎవరైనా చంపి రైల్వే ట్రాక్ పై పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

also read:డీజే సౌండ్‌‌కు 63 కోళ్లు మృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌల్ట్రీ ఫామ్ ఓనర్

మూడు రోజుల క్రితం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. అయితే  వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులు అదృశ్యం కావడంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏకే రావు మృతదేహం గురించి సమాచారం ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి ఫోన్లు పనిచేయని విషయాన్ని గుర్తించారు. సుజనా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏకే రావు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.ఏకే రావు ఆర్ధిక సంబంధమైన విషయాలపై  బెంగుళూరులోని పోలీసులకు ఇటీవలనే పిర్యాదు చేసినట్టుగా సమాచారం. అయితే  ఈ ఫిర్యాదు చేసిన  తర్వాతే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులు హైద్రాబాద్ లో లేరని స్థానికులు చెబుతున్నారు.  అయితే ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మరణించడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఏకే రావు శరీరంపై  కత్తి గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఏకే రావును ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా  భావించినప్పటికీ మృతదేహంపై గాయాలతో హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు.  అయితే ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమయ్యాయా లేక ఇతర కారణాలున్నాయా అనే విషయమై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. 

 

పలు సినిమాల్లో పాటలు పాడిన సింగర్ హరిణి

సింగర్ హరిణి  గాయనితో పాటు డబ్బింగ్ ఆర్ఢిస్ట్ కూడా.  తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ సినిమాల్లో ఆమె సుమారు   3500 కు పైగా సినిమాల్లో  పాటలు పాడారు. ఆమె తమిళంలో ఎక్కువ పాటలు పాడారు.  మరో సింగర్ టిప్పుతో హరిణి వివాహమైంది.  తెలుగులో  మురారి , గుడుంబా శంకర్, ఘర్షణ, అల్లుడు శీను, సైనికుడు, 100 % లవ్, లెజెండ్, స్పైడర్,నిశ్శబ్దం  తదితర సినిమాల్లో ఆమె పాటలు పాడారు. 

click me!