సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ. 66.11 లక్షలు సీజ్

By narsimha lodeFirst Published Mar 7, 2021, 4:38 PM IST
Highlights

టాస్క్‌ఫోర్స్‌ సోదాల్లో ఓ ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66.11 లక్షలు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు సివిల్ పోలీసులు శనివారం నాడు సోదాలు నిర్వహించారు. 


సిద్దిపేట: టాస్క్‌ఫోర్స్‌ సోదాల్లో ఓ ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66.11 లక్షలు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు సివిల్ పోలీసులు శనివారం నాడు సోదాలు నిర్వహించారు. 

శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్‌ఎంపీ కొడం ఆంజనేయులు ఇంట్లో ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, సివిల్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో క్లినిక్‌ నడిపిస్తూ వినాయకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు.

ఈ సోదాల్లో రూ.66,11,100 స్వాదీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు మహేందర్‌ తెలిపారు. సీజ్‌ చేసిన డబ్బులను ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నట్లు తెలిపారు. కాగా, ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆస్తులు ఎలా వచ్చాయనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. 
 

click me!