చెట్టు నరికినందుకు వెయ్యి రూపాయలు ఫైన్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Jul 22, 2019, 8:59 PM IST
Highlights

మరోక్కసారి ఇలా చెట్టును నరికితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు జైలుకు కూడా పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై హరితహారంలో చెట్లును నరికితే ఇలాంటి పరిస్థితే ఎవరికైనా ఎదురవుతుందని కూడా హెచ్చరించారు. 

సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హరితహారం చెట్టును కొట్టిన వ్యక్తికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది. చెట్టును నరికిన వ్యక్తి ఫోటోను, ఫైన్ స్లిప్ ను అతనికి పంపించింది. 

సిద్ధిపేట మున్సిపాలిటీ  హైదరాబాద్ వెళ్లే రోడ్డులో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జి. వీరేశం అనే వ్యక్తి హరితహారం చెట్టును నరికివేశాడు. చెట్టును నరికివేస్తున్న అతడిని మున్సిపాలిటీ సిబ్బంది పట్టుకున్నారు. రూ.1000 ఫైన్ వేసి మందలించి వదిలేశారు. 

click me!