
హైదరాబాద్ : Hyderabad ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) పల్లె రాఘవేంద్ర గౌడ్ మరణించారు. శంషాబాద్ నుంచి తుక్కుగుడా వెళ్తున్న కారు లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాఘవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ రైల్వే పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 21న కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరోగ్యం బాగాలేని అత్తను పరామర్శించడానికి బయలు దేరింది ఆ family. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదలడం ఎందుకులే అనుకుని twins సహా మరో చిన్నారితో బండిపై బయలు దేరింది. సరదాగా సాగిపోతున్న వారి ప్రయాణాన్ని.. ఓ వ్యాన్ మృత్యువు రూపంలో వెంబడించింది. బండిని కొట్టడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయింది. దంపతులతో పాటు కవలలిద్దరూ మృతి చెందగా, మరో చిన్నారి కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోంది.
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వారధిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర road accidnetలో ఒకే కుటుంబానికి చెందిన four members మృతిచెందగా.. చిన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గుత్తినదీవి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ వైదాడి కుమార్ (35), భార్య పద్మ (31), కుమారుడు సత్యవర్మ (10), కుమార్తెలు హర్షిత (10) సాత్విక (సిరి వదన)తో కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది.
ఘటనలో కుమార్, పద్మ, సత్య వర్మ అక్కడికక్కడే మృతి చెందారు. హర్షిత కాకినాడలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాలపాలైన వారి చిన్న కుమార్తె ఎనిమిదేళ్ల సాత్వికకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని doctors తెలిపారు. అనారోగ్యంతో ఉన్న అత్తను పరామర్శించేందుకు కుమార్.. భార్య, ముగ్గురు పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో సత్యవర్మ, హర్షిత కవలలు. ప్రమాదానికి కారణమైన వ్యానును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.