బీజేపీలోకి పవన్ యూత్ అసోసియేషన్

Published : Nov 28, 2018, 12:19 PM IST
బీజేపీలోకి పవన్ యూత్ అసోసియేషన్

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్   అభిమానులు దాదాపు 100మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

తెలంగాణలో ఎన్నికల పర్వం మొదలైంది.  అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.  తెలంగాణలో ఈ సారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి బీజేపీ సైతం గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందులో భాగంగా ఆకర్ష కార్యక్రమం చేపట్టింది. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రతయత్నిస్తోంది.

కాగా.. తాజాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్   అభిమానులు దాదాపు 100మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కవాడిగూడ అధ్యక్షుడు ఎం.నాగేష్ నాయకత్వంలో వారు బీజేపీలో చేరారు. కాగా.. వారందరికీ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పవన్ ఫ్యాన్స్ తమ పార్టీలో చేరానని లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.