ఈటల రాజేందర్ అనుచరుడికి ఊహించని షాక్...

Published : May 06, 2021, 02:07 PM ISTUpdated : May 06, 2021, 02:08 PM IST
ఈటల రాజేందర్ అనుచరుడికి ఊహించని షాక్...

సారాంశం

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచురుడు సాదవ రెడ్డి అనూహ్యమైన షాక్ తగిలింది. ఆయనకు అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‘భూ’ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. నిన్న, మొన్నటి వరకూ ఈటలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్‌లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటలపై మాటలు తూటాలు పేల్చారు. 

అయితే.. ఈటలకు విరామం ఇచ్చారేమో కానీ.. ఇప్పుడు ఆయన అనుచరులను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతవరకూ ఎప్పుడూ లేని ఆరోపణలను ఇప్పుడు తెరపైకి తెచ్చి ఊహించని రీతిలో షాకులిస్తున్నారు.బ్యాంక్ నుంచి నోటీసులు..ఈటల అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కెడీసీసీ బ్యాంక్ నోటీసులు పంపింది. 

సింగిల్ విండో ఛైర్మెన్‌గా ఉన్నప్పుడు నిధులు గోల్‌మాల్ చేశారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి!. మొత్తం 18 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని గురువారం నాడు బ్యాంకు నోటీసులు పంపింది. అయితే.. ఈ నోటీసులపై ఇంతవరకూ సాదవ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

కాగా.. గత ఐదు రోజులుగా ఈటలకు సాదవ రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ఇందుకే ఆయన్ను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందని జడ్పీటీసీ, ఈటల అనుచరులు చెప్పుకుంటున్నారు. మున్ముందు ఇంకెంత ఈటల అనుచరులకు ప్రభుత్వం షాకిస్తుందో అని కరీంనగర్ జిల్లా నేతలు సర్వత్రా చర్చించుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?