ఆ కాంగ్రెస్ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకొండి : షబ్బీర్ అలీ డిమాండ్

By Arun Kumar PFirst Published Dec 19, 2018, 3:20 PM IST
Highlights

టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుపై స్పందించిన శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ముగ్గురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోంచి టీఆర్ఎస్‌లోకి పిరాయించిన ఎమ్మెల్సీలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆయన ఇప్పుడెలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన అందరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. 

ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో శాసనమండలి ఛైర్మన్ ను కలిసి ఆయనపై ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దామోదర్ రెడ్డి పార్టీ పిరాయింపుకు సంబంధించిన ఆధారాలను ఛైర్మన్‌కు అందించి చర్యలు తీసుకోవాలని కోరతామని షబ్బీర్ అలీ వెల్లడించారు. 

గతంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎమ్మెల్సీ దామోదన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు అధిష్టానానికి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన ప్రయత్నం మాత్రం ఫలించలేదు. నాగం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో తన మాట చెల్లకపోవడంతో రగిలిపోయిన దామోదర్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ఎన్నికల సమయంలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ నాయకులు స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఆ ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. శాసనమండలి ఛైర్మన్ చర్యలను షబ్బీర్ అలీ తాజాగా తప్పుబట్టారు.   

click me!