కంపెనీ వేధింపులు తాళలేక.. యువకుడి ఆత్మహత్య

Published : Dec 19, 2018, 03:07 PM IST
కంపెనీ వేధింపులు తాళలేక.. యువకుడి ఆత్మహత్య

సారాంశం

కంపెనీ వేధింపులు తాళలేక ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

కంపెనీ వేధింపులు తాళలేక ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాంధీనగర్ కి చెందిన నూతలగంటి  నర్సింగ్(30)  సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా.. గతవారం రోజులుగా తమకు యాజమాన్యం నుంచి వేధింపులు మొదలయ్యాయని... తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. నర్సింగ్ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం వేధింపులతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డారని.. నర్సింగ్ మృతదేహంతో లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆఫీసు కార్యాలయం ఎదుట అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu