కన్న కూతురిమీద లైంగింక దాడి.. కామంధుడైన తండ్రికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష..

Published : Mar 08, 2022, 09:16 AM IST
కన్న కూతురిమీద లైంగింక దాడి.. కామంధుడైన తండ్రికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష..

సారాంశం

కామంతో కళ్లు మూసుకుపోయి కూతురి మీదే అత్యాచారానికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన భార్యను కొట్టి.. మళ్లీ కూతుర్ని తన దగ్గరికి పంపాలంటూ వేధించాడు. ఈ కామాంధుడైన తండ్రికి నిజామాబాద్ లోని పోక్సో కోర్టు 20యేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. 

నిజామాబాద్ : కన్న కూతురి మీద అత్యాచారానికి పాల్పడిన తండ్రికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ Pokso Court జడ్జి పంచాక్షరి సోమవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెడితే.. 
Nizamabad District రుద్రూర్ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. బంధువుల ఇంట్లో శుభకార్య నిమిత్తం పిల్లలను ఇంట్లోనే ఉంచి తల్లి వేరే గ్రామానికి వెళ్లారు. 2018 మే 16న మద్యం మత్తులో ఉన్న తండ్రి పెద్ద కుమార్తెపై Rape చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

బాలిక గర్భం దాల్చడంతో గర్భస్రావ మాత్రలు వేయించాడు. అనంతరం 2019 జూన్ 28న మరోసారి భార్యను కొట్టి కూతురిని తన వద్దకు పంపించాలంటూ బెదిరించాడు. దీంతో భర్త నిర్వాకంపై రుద్రూర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తరఫున పీపీలు అల్లూరి రాంరెడ్డి, బంటు వసంత వాదనలు వినిపించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20యేళ్లు కఠిన కాగారార శిక్ష రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయసేవా సంస్థ ద్వారా రూ. 1.50 లక్షల పరిహారం కోసం బాలిక దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. 

ఇలాంటి అమానుష ఘటనే ఫిబ్రవరి 24న జరిగింది. మధ్యప్రదేశ్ లో ఓ కన్నతండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి.. పైశాచికత్వానికి ఒడిగట్టాడు. కంటిపాపలా... చూసుకోవాల్సింది పోయి.. విషనాగులా కాటేశాడు. అత్యంత దారుణమైన.. హేయమైన.. పాశవిక చర్యకు ఒడిగట్టాడు. కూతుర్ని చంపి... ఆమె మృతదేహంతో తన కామవాంఛ తీర్చుకున్నాడు. సభ్య సమాజం కలలో కూడా ఊహించని అత్యంత భయంకరమైన ఘటన ఇది. 

Madhya Pradesh గునా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న కుమార్తె(14)ను హత్య చేసిన ఓ తండ్రి అంతటితో ఆగకుండా ఆమె dead body మీద molestationకి పాల్పడ్డాడు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మీద అఘాయిత్యం చేసిన ఆ వ్యక్తి.. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు తన కుమార్తె missing అని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక బంధువులను, ఇరుగుపొరుు వారిని విచారించారు. బాలిక చివరగా తండ్రితోనే కనిపించిందని అందరూ చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. నిజం అంగీకరించాడు.  

ఇదిలా ఉండగా, ఈ యేడాది జనవరి 4న ఇలాంటి దారుణమైన ఘటనే రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునే కీచకపర్వానికి తెరతీశారు. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారయత్నం చేసి, హత మార్చడమే కాకుండా.. అనంతరం బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ పట్టణంలో వెలుగుచూసింది. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. పదహారేళ్ల బాలిక శవ పరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాదు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ భయంకర నిజాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆమె మీద అత్యాచార యత్నం చేసి, చంపేయడమే కాకుండా ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది.

PREV
click me!

Recommended Stories

Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu