Nirmal District News:నిర్మల్‌లో తుపాకీ కలకలం

Published : Apr 26, 2022, 09:27 AM ISTUpdated : Apr 26, 2022, 09:33 AM IST
Nirmal District News:నిర్మల్‌లో తుపాకీ కలకలం

సారాంశం

నిర్మల్ జిల్లాలో తుపాకీ కలకలం సృష్టించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చెరువు వద్ద రివాల్వర్ ను వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. Telangana News

నిర్మల్: Nirmal జిల్లా కేంద్రంలోని ఓ చెరువు వద్ద Revolver లభ్యమైంది. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న  పోలీసులు రివ్వాలర్ ను స్వాధీనం చేసుకొన్నారు.

నిర్మల్ ఎఎస్ రెడ్డి కాలనీలోని దివ్య గార్డెన్ పక్కన ఉన్న సఖి సెంటర్ వద్ద చెరువులోని బండపై రివాల్వర్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రివాల్వర్ తో పాటు 10 రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకొన్నారు. తుపాకీ ఇక్కడికి ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. రివాల్వర్ Police శాఖకు చెందిందిగా  అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పొరపాటున ఇక్కడ తుపాకిని మర్చిపోయారా లేదా ఉద్దేశ్యపూర్వకంగా వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీస్ శాఖకు చెందిన ఆయుధాల రిజర్వ్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నట్టుగా నిర్మల్ డీఎస్పీ డి ఉపేందర్ రెడ్డి చెప్పారు. ఈ రివాల్వర్ ను ఎవరికి కేటాయించారనే విషయమై కూడా పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. యాంటీ నక్సల్స్  విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ఈ  రివాల్వర్ ఉపయోగించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రివాల్వర్ ను ఎవరైనా దుండగులు తీసుకెళ్తే దుర్వినియోగం చేసే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు