ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తెలంగాణ సెక్రటేరియేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమెను వాహనంతో సహా లోపలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ సెక్రటేరియేట్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క చేదు అనుభవం ఎదుర్కొన్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు శుక్రవారం ఆమె సెక్రటేరియేట్ కు వచ్చారు. కానీ ఎమ్మెల్యేను వాహనంతో లోపలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గేటు వద్దనే అడ్డుకున్నారు.
విషాదం.. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత సంతతి కుటుంబం..
దీంతో సీతక్క అసహనం వ్యక్తం చేశారు. కొంత సమయం అక్కడే నిలబడ్డారు. తరువాత వాహనాన్ని అక్కడే ఉంచి.. గేటు దగ్గర నుంచి సెక్రటేరియేట్ భవనం దగ్గరకు నడుచుకుంటూనే వెళ్లారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి బయటకు వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
కింది స్థాయి పోలీసులు మేల్కోవాలి..
దొరను గద్దె దించేందుకు సిద్ధం కావాలి..
గన్మెన్ లను కొట్టడం ఏంటి ? వెంటనే క్షమాపణ చెప్పాలి !pic.twitter.com/m2VZ5RCjQD
ప్రజాధనంతో, ప్రజల కోసం కట్టిన సెక్రటేరియేట్ లోకి ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. దీనిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఆయా విభాగాల్లోని అధికారులను, పీఎస్ లను కలిశానని, వారికి వినతిపత్రాలు ఇచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారని, కానీ వారికి తమను అడ్డుకోవాలని ఆదేశాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇది తెలంగాణ సెక్రటేరియేటా ? లేకపోతే సొంత భవనమా అని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలు, ప్రతిపక్ష నాయకులు సెక్రటేరియేట్ లోకి రాకూడదని బోర్డు పెట్టాలని ఆమె ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.