''కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్''

By Arun Kumar PFirst Published Dec 10, 2018, 8:55 PM IST
Highlights

నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు రసవత్తర ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు జరిగిందంతా ఒకెత్తయితే...రేపు వెలవడే ఫలితాలు మరో ఎత్తు. పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం రేపె బయటపడనుంది. అయితే పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అలజడులు చెలరేగడంతో కౌటింగ్ సమయంలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పేడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కౌటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగ అడిషినల్ డిజి జితేందర్ వెల్లడించారు. 

ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలు కేంద్ర, రాష్ట్ర బలగాల ఆధీనంలో ఉంటాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు...నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. కాబట్టి అక్కడ ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతులు ఉండవని జితేందర్ వెల్లడించారు. 

ప్రతి కౌంటింగ్ కేంద్రం సీసీ కెమెరాల నిఘాలో ఉండనుందన్నారు. అందుకోసం భారీగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తారని డిజి జితేందర్ తెలిపారు. 

click me!
Last Updated Dec 10, 2018, 8:55 PM IST
click me!