వరంగల్‌ పట్టణంలో రేపు 144 సెక్షన్ అమలు...

Published : Oct 06, 2018, 11:51 AM IST
వరంగల్‌  పట్టణంలో రేపు 144 సెక్షన్ అమలు...

సారాంశం

వరంగల్ పట్టణంలో పలు ప్రాంతాల్లో రేపు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమీషననర్ రవీందర్ ప్రకటించింది. నగరంలో పలు పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.  

వరంగల్ పట్టణంలో పలు ప్రాంతాల్లో రేపు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ విశ్వనాథ్ రవీందర్ ప్రకటించింది. నగరంలో పలు పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు కల్పిస్తున్నట్లు కమీషనర్ వెల్లడించారు. ఉదయం 10 గంటనుండి సాయంత్రం 5 గంటల  వరకు రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనుంది. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కమీషనర్ వెల్లడించారు. 

ఈ ఆంక్షల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగానే హెచ్చరిస్తున్నట్లు కమీషనర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టవద్దని నగరావాసులకు సూచించారు. విద్యార్థులు కూడా పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. 

 జీహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్లు, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్‌ , టీఎస్ ఆర్టీసీ పోస్టుల కోసం టీఎస్‌పిఎస్సీ ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,046 పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్-4 ఎగ్జామ్ జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. ఆదివారం జరిగే ఈ  పరీక్ష కోసం అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. 
 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్