ఎసి రైలుకు దిక్కులేదు, జిల్లా విమానాలెలా నడుస్తాయో!

Published : Nov 08, 2016, 04:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎసి రైలుకు దిక్కులేదు, జిల్లా విమానాలెలా నడుస్తాయో!

సారాంశం

జిల్లాకొక విమానాశ్రయం తేవాలనుకుంటుంటే ముఖ్యమయిన ఎసి రైలొకటి ప్రయాణించే వారు లేక   శాశ్వతంగా రద్దయింది.

జిల్లాకొక విమానాశ్రయం నెలకొల్పేందుకు తెలుగురాష్ట్రాలలో  వేగంగా ప్రయత్నాలు సాగుతున్నపుడు అతి ముఖ్యమయిన ఎసి రైలొకటి ప్రయాణించే వారు లేక రద్దయింది, శాశ్వతంగా.

 

ఇదేదో ప్రయాణాలకు నోచుకోని మారుమూల పట్ణాణానికో,  ఎడారి ప్రాంతాని కో కాదు. రోజూల లక్ష లాది మంది ప్రయాణికులు ప్రయాణించే  ఏడుకొండల వాడి సన్నిధి , తిరుపతికి నడిచే రైలు.  ఏడాది పొడగునా ప్రయాణికుల రద్దీ కొనసాగే తిరుపతికి, చాలా అట్టహాసంగా వేసిన రెండు ఏసీ డబుల్‌ డెక్కర్‌ రైళ్లను  రద్దు చేయక తప్పడం లేదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.   మూడేళ్లు ఎదురు చూసినా దీనికి తగ్గ ప్రయాణికులు రాకపోవడంతో, నడపడం సాధ్యం కాక, కాచిగూడ- గుంటూరు మధ్య నడిచే ఈ ఎసి రైలును అధికారులు శాశ్వతంగా రద్దు చేస్తున్నారు.

సగటు ప్రయాణికుల సంఖ్య  ఆశించిన రీతిలో ఉండక పోవడం, నిర్వహణ ఖర్చు కూడ ఎల్లక పోవడంతో  ఇలా చేయవలసి వచ్చిందన అధికారులు చెబుతున్నారు.

 

కాచిగూడ-గుంటూరు-కాచిగూడ (రైలు నెంబరు: 22118/22117), కాచిగూడ-తిరుపతి-కాచిగూడ (రైలు నెంబరు: 22120/22119) మార్గాల్లో నడుస్తున్న ఈ  ఏసీ డబుల్‌ డెక్కర్‌ రైళ్లను ఈనెల 14వ తేదీ నుంచి శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

 

 2014-15 రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన డబుల్‌ డెక్కర్‌ రైళ్లను 2014 మే 13, 14వ తేదీల్లో  ప్రారంభించారు. మొదటి రోజు నుంచే వీటికి ప్రయాణికుల కొరత మొదలయింది. రోజలుగడిస్తే  ప్రజాదరణ లభిస్తుందనుకున్నారు.  ఆ ఆశ అడియాశ అయింది. ఈ కొత్త డబల్ డెక్కర్ రైల్లో ఎక్కేందుకు ఎవరూ సుముఖంగా లేరు.

 

 చివరకు ఈ ఫ్యాన్సీ సర్వీసు దక్షిణమధ్య రైల్వేకు భారమయి కూర్చుంది. దీనిని వదిలించుకోవలసిందే నని అధికారులు రైల్వే బోర్డ్డుకు ప్రతిపాదనలు పంపారు. దీనికి రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది.

ఈ నిర్ణయం తీసుకునే ముందుకు ప్రజాప్రతినిధులు,  రైల్వే ప్రయాణికులతో కూడా  సంప్రదించి  అభిప్రాయాలను కూడా సేకరించారు.

ఇదీ హైదరాబాద్- తిరుపతి ఎసి రైలు పరిస్థితి.  జిల్లాలకు ఎసి బస్సులు కూడా నడవని  అర్ధిక పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా లు జిల్లా జిల్లాకొక విమానశ్రయం కట్టాలనుకుంటున్నారు.  మరి వీటికి ప్రయాణికులుంటారా. విమనా సర్వీసులు లాభసాటిగా ఉంటాయా? లేక పోతే, నష్టాలు వచ్చినా, ప్రభుత్వం నష్టం ప్రయివేటు కంపెనీలకు చెల్లించి ఖాళీ విమనాలు అటు ఇటు తిప్పుతారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హీరో రామ్ చరణ్  కంపెనీకి రు 5 కోట్ల మేర నష్టం భరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది చిరంజీవిని కాంగ్రెస్ నుంచి బయటకు లాగే ’ కాపు  నిర్ణయం’ అని చాలా మంది హేళన చేస్తున్నారు.

జిల్లాల విమనాశ్రయాలకు విమానాలు నడపలేకపోయినా, విమానాశ్రయాలు కట్టడం వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరతాయని లోగుట్టు తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ఇందులో ఒకటి  ముఖ్యమంత్రుల చిన్న విమానాలు దిగవచ్చు. అపుడు హెలీ కాప్టర్లు మానేసి చిన్న చిన్న విమనాలు కొనవచ్చు. రెండువది విమానాశ్రయం పేరుతో రియల్ దందా పెరుగుతుంది. రాష్ట్రానికి , రిజస్ట్రేషన్ లశాఖకు, లంచం మరిగిన అధికారులకు రాబడి పెరుగుతుంది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Weather Report: కొన‌సాగుతోన్న ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణ‌లో వాతావ‌రణంలో మార్పులు
iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !