పుస్తక ప్రదర్శనలో ఎమ్మెల్యే సీతక్క సందడి

By telugu teamFirst Published Dec 31, 2019, 9:04 AM IST
Highlights

అసెంబ్లీ సమావేశాలప్పుడు తాను అక్కడున్న లైబ్రరీకి వెళతానని చెప్పారు. ఇటీవల తనను అసెంబ్లీ గ్రంథాలయ కమిటీ సభ్యురాలిగా నియమించారని చెప్పారు.
 

పుస్తక ప్రదర్శనలో ఎమ్మెల్యే సీతక్క సందడి చేశారు. సామాన్యురాలిలా వచ్చి... ఆమె తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దానిని సోమవారం ఆమె సందర్శించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... నెలకొక్కసారైనా పుస్తకాలు కొనడం తనకు అలవాటు అని చెప్పారు.

హైదరాబాద్ కి వచ్చినా, వరంగల్ లో నైనా ప్రగతిశీల రచనలు దొరికే నవ తెలంగాణ, నవ చేతన వంటి బుక్ హౌస్ లకు వెళ్లి కావాల్సిన పుస్తకాలు తాను కొంటూ ఉంటానని ఆమె చెప్పారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు తాను అక్కడున్న లైబ్రరీకి వెళతానని చెప్పారు. ఇటీవల తనను అసెంబ్లీ గ్రంథాలయ కమిటీ సభ్యురాలిగా నియమించారని చెప్పారు.

ఈ నేలపై ఉన్న అడవి బిడ్డల నుంచి ఆఫ్రికాలోని ఆదివాసీల వరకు వాళ్ల జీవితాలకు సంబంధించిన ఎలాంటి పుస్తకం వచ్చినా తాను తీసుకుంటానని చెప్పారు. చెగువేరా, జార్జిరెడ్డి వంటి స్ఫూర్తిదాయకమైన రాజకీయ నాయకుల జీవిత రచనలు చదవడం అంటే తనకు ఇష్టమని చెప్పారు. రోజూ రాత్రి పడుకునేటప్పుడు ఒక్క గంటైనా పుస్తకం చదువుతానని చెప్పారు. 

అమ్మ, ఎలక్స్ హేలీ, ఏడు తరాలు వంటి పుస్తకాలు తనను చాలా ఎక్కువగా ప్రభావితం చేశాయని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రపై వచ్చిన పుస్తకాలన్నీ తాను దాదాపు చదివేశానన్నారు. తన ఇంట్లో ఓ చిన్నపాటి లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. 

click me!