టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు..

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 4:31 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదు అయింది. రామచంద్ర భారతిపై ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ బంజారాహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదు అయింది. రామచంద్ర భారతిపై ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ బంజారాహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో రామచంద్ర భారతి వద్ద వద్ద దొరికిన ఐఫోన్, లాప్ టాప్‭లో.. నకిలీ పాస్ పోర్టు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భరత్ కుమార్ శర్మ పేరు‌తో పాస్‌పోర్టు ఉందని పోలీసులకు తెలిపారు. అందులో అడ్రస్ కర్ణాటకలోని పూత్తూరు పేరుతో ఉందని గుర్తించినట్టుగా చెప్పారు. 

ఇక, ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం వెలుగుచూసిన కొద్ది రోజులకు రామచంద్ర భారతిపై రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రామచంద్ర భారతి ఫేక్ ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను తయారు చేయించుకొని పెట్టుకున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 3వ తేదీన సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిందితుల నుంచి రికవరీ చేసిన పలు ఆధార్, పాన్, లైసెన్సు వివరాలు వేర్వేరుగా ఉన్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

click me!