ఇక నుండి నా ఆట చూపిస్తా, వాళ్లంతా పిల్లలు: జగ్గారెడ్డి సంచలనం

Published : Mar 22, 2022, 11:28 AM ISTUpdated : Mar 22, 2022, 11:38 AM IST
ఇక నుండి నా ఆట చూపిస్తా, వాళ్లంతా పిల్లలు: జగ్గారెడ్డి  సంచలనం

సారాంశం

రాజకీయాల్లో తన ఆటను చూపిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆట ఆడే వాళ్లంతా చిన్న పిల్లలని జగ్గారెడ్డి చెప్పారు.

హైదరాబాద్: రాజకీయాల్లో ఇప్పుడు ఆట ఆడే వాళ్లంతా పిల్లలు అని Sangareddy ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. తన ఆటను ఇక ముందు చూపిస్తానని తేల్చి చెప్పారు.మంగళవారం నాడు Jagga Reddy హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.జగ్గారెడ్డి అంటే ఏమిటీ, Revanth Reddyఅంటే ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందన్నారు.  ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అన్ని మాట్లాడుతానన్నారు.

 తనతో Mallubhatti Vikramarka, Uttam Kumar Reddy సహా ఎవరూ కూడా మాట్లాడలేదని జగ్గారెడ్డి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో మాట్లాడేందుకు అందరూ భయపడుతున్నారేమోనని జగ్గారెడ్డి చెప్పారు. నాకు show cause నోటీసులు వస్తాయో లేవో తనకు తెలియదన్నారు. తనకు షోకాజ్ నోటీసు వచ్చినప్పుడు మాట్లాడుతానని చెప్పారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడుతానన్నారు.

నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని సమర్ధిస్తానని చెప్పారు. మొన్న వ్యక్తిగతంగా అన్నందుకు కొందరు నొచ్చుకొని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మాటలను వెనక్కి తీసుకొంటున్నానని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడుకొనే వీలుంటుందన్నారు. పదవుల  కోత అనేది స్పోర్టివ్ గా తీసుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు.

మైనస్‌లను ప్లస్ ఎలా చేసుకోవాలో తనకు తెలుసునని జగ్గారెడ్డి చెప్పారు.  ఏ రోగానికి ఏ మందు పెట్టాలో తనకు తెలుసునని జగ్గారెడ్డి తెలిపారు. తనకు ఢిల్లీ నుండి ఎలాంటి పిలుపు రాలేదని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను అన్నింటిని మంచి వాటిగా చెప్పలేమన్నారు. అయితే అన్నింటిని కూడా చెడ్డవిగా కూడా కొట్టి పారేయలేమని జగ్గారెడ్డి వివరించారు.

సంగారెడ్డిలో తనపై కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరిన 24 గంటల్లోనే జగ్గారెడ్డి బాధ్యతలను ఇతరులకు అప్పగించారు. మరో వైపు జగ్గారెడ్డి వ్యవహర శైలిపిై మాణికం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి తీరుపై కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇవాళ మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వి. హనుమంతరావులు ఢిల్లీకి వెళ్లారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Politics : రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడుతున్నారా..? మంత్రుల భేటీవెనక అసలు సంగతేంటి..?
Jio AI Education : జియో ఏఐ ఎడ్యుకేషన్.. విద్యార్థులకు, టీచర్లకు రూ. 35 వేల విలువైన ప్లాన్ ఉచితం !