టీఆర్ఎస్‌లోకి నన్ను తీసుకోరు... నా బిడ్డ నిర్ణయం మేరకే: జగ్గారెడ్డి

By Arun Kumar PFirst Published Mar 21, 2019, 6:09 PM IST
Highlights

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను  కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటించిన జగ్గారెడ్డి అదే విషయంపై తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

తనను ఇప్పటివరకు టీఆర్ఎస్ లో చేరాలంటూ ఎలాంటి ఆహ్వానం రాలేదని తెలిపారు. అయినా అలా వస్తుందని కూడా తాను అనుకోవడం లేదన్నారు. నాలాంటి నాయకులను పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందులుంటాయని ఆ  పార్టీ నాయకులకు తెలుసన్నారు. తాను ఎవరీ మాట వినకుండా నచ్చిందే చేస్తాను...ఇలా వుండటం ఆ పార్టీ వారికి ఇష్టం వుండదని జగ్గారెడ్డి అన్నారు. 

అయితే తాను ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే తప్పనిసరిగా అలాంటి పరిస్థితి వస్తే తన కూతురు నిర్ణయం మేరకు నడుచుకుంటానని జగ్గారెడ్డి వెల్లడించారు. అయితే అలాంటి పరిస్థితి వస్తుందని తాను అనుకొవడం లేదన్నారు. 

2023 లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఖాయమన్నారు. అంతేకాకుండా ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ మల్కాజిగిరి, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం స్థానాలను  టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు గెలిచే అవకాశముందన్నారు. సికింద్రాబాద్, మెదక్ లలో కూడా కాంగ్రెస్ బలమైన పోటీ  ఇస్తుందని జగ్గారెడ్డి తెలిపారు. 

click me!
Last Updated Mar 21, 2019, 6:09 PM IST
click me!