బాబుకు షాక్: త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతా: సండ్ర (వీడియో)

Published : Mar 03, 2019, 11:15 AM ISTUpdated : Mar 03, 2019, 11:45 AM IST
బాబుకు షాక్: త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతా: సండ్ర (వీడియో)

సారాంశం

త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. అభివృద్ధి కోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతానని ఆయన ప్రకటించారు.  

ఖమ్మం:త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. అభివృద్ధి కోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతానని ఆయన ప్రకటించారు.

ఆదివారం నాడు ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. టీడీపీకి త్వరలోనే రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.

తాను కేసులకు భయపడనని సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు.కేసులో జైలుకు కూడ వెళ్లి వచ్చినట్టుగా  ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయమై ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. ఈ కేసు న్యాయవ్యవస్థ చేతిలో ఉందని సండ్ర అభిప్రాయపడ్డారు.

 

"

సత్తుపల్లి నియోజకవర్గంలో మూడు దఫాలుగా తనను ప్రజలు గెలిపించారని చెప్పారు.  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీలోకి చేరాల్సిన అవసరం ఉందన్నారు.

విపక్షంలో ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.నియోజకవర్గంలోని  కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ రోజున టీఆర్ఎస్‌లో చేరాలనే విషయాన్నిప్రకటించనున్నట్టు సండ్ర స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.