మరికొద్దిక్షణాల్లోనే పెళ్లి షాకిచ్చిన వరుడు: ఫంక్షన్‌ హల్‌లోనే సూసైడ్

Published : Nov 10, 2019, 12:55 PM ISTUpdated : Nov 10, 2019, 06:52 PM IST
మరికొద్దిక్షణాల్లోనే పెళ్లి షాకిచ్చిన వరుడు: ఫంక్షన్‌ హల్‌లోనే సూసైడ్

సారాంశం

పెళ్లికి కొద్ది క్షణాల ముందే వరుడు సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: హైద్రాబాద్‌ కొంపల్లిలోని శ్రీ ఫంక్షన్‌హల్‌లో మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగానే పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సందీప్  ఆత్మహత్య ఎందుకు చేసుకొన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైద్రాబాద్‌ పేట్ బషీరాబాద్‌కు చెందిన సందీప్‌కు ఇవాళ కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు.వివాహం కోసం రెండు కుటుంబాల తరపు పెద్దలు కొంపల్లిలోని  శ్రీ ఫంక్షన్‌హల్‌కు ఆదివారం చేరుకొన్నారు. 

వరుడు సందీప్ కూడ ఫంక్షన్ హల్‌కు చేరుకొన్నాడు. అయితే ఫంక్షన్‌హల్‌లోనే వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన సందీప్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై ఆందోళన నెలకొంది.

శ్రీనివాసాచారి యాదాద్రి భువనగిరి జిల్లాలో  ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.శ్రీనివాసాచారి కొడుకే సందీప్.  సందీప్‌కు పేట్‌బషీరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో వివాహం నిశ్చయమైంది.  ఆదివారం నాడు ఉదయం కొంపల్లిలోని శ్రీ ఫంక్షన్ హల్‌లో వివాహం జరపాలని నిర్ణయించారు.

శ్రీనివాసాచారి కుటుంబం దిల్‌షుఖ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం వివాహం కోసం శ్రీనివాసాచారి కుటుంబం శ్రీ ఫంక్షన్ హల్‌కు చేరుకొంది. పెళ్లి ముహుర్తం దగ్గరపడుతున్న సమయం అవుతున్నా కూడ సందీప్ తన రూమ్‌ నుండి బయటకు రాలేదు. అయితే వరుడి కుటుంబసభ్యులు రూమ్‌లోకి వెళ్లి చూశారు.

అయితే అప్పటికే సందీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సందీప్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. సందీప్‌ను ఎవరైనా హత్య చేశారా, సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?