వలపు వలతో కిలాడీ లేడీలు: బుక్కవుతున్నారిలా..

By narsimha lodeFirst Published Nov 10, 2019, 12:36 PM IST
Highlights

వలపు వలతో వల విసురుతూ పలువురిని మోసం చేస్తున్నారు. కిలాడీ లేడీల వలలో చిక్కుకొంటే  మోసపోకతప్పదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు అందుతున్న ఫిర్యాదులు అతి తక్కువగానే ఉంటున్నాయి.

హైదరాబాద్: మాయ లేడీలు సోషల్ మీడియాలో విసురుతూ  డబ్బులు గుంజుతున్నారు. తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతోందని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మరికొందరు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులకు చేరే ఫిర్యాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి నెల రోజుల వ్యవధిలో మాయలేడి వలకు చిక్కి రూ. 20 లక్షలు పోగొట్టుకొన్నాడు. తనకు వల వేసిన  మహిళ ఎవరనే విషయాన్ని  ఆరా తీస్తే తనతో కలిసి పనిచేసిన యువతే  తన నుండి డబ్బులు లాగిందని గుర్తించాడు.మరోవైపు ఓ ప్రైవేట్ సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్న ఓ వ్యక్తికి మాయలేడి వాట్సాప్‌లో పలకరించింది,. చాలా అందంగా ఉన్నావంటూ అతడికి వల విసిరింది.

రెండు రోజుల తర్వాత ఆమెతో అతను మాటలు కలిపాడు. ఆ తర్వాత  వారిద్దరూ తరచూ చాటింగ్ చేసేవారు. కొంత కాలం తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాప్ అయింది. కొన్ని రోజుల తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆ మాయ లేడి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని లక్ష రూపాయాలు ఇవ్వాలని కోరాడు. ఆ మాటలను నమ్మిన బాధితుడు తన భార్య నగలను తాకట్టు పెట్టి రూ. లక్ష రూపాయలను పంపాడు. ఆ తర్వాత కానీ తాను మోసపోయినట్టుగా బాధితుడు గుర్తించలేదు.

also read:వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....

మాజీ ఎయిర్‌హోస్టెస్ దంపతులు హైద్రాబాద్‌కు చెందిన ఓ మత ప్రచారకుడికి వేసింది.హోటల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని మత ప్రచారకుడిని కోరింది. ఆమె చెప్పినట్టుగానే అతను  రూ. 10 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మాయలేడీ మత ప్రచారకుడితో సన్నిహితంగా ఉన్నట్టుగా వీడియోలు, ఫోటోలు తీసి కోటి రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడుఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. 

సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని వలపు వలతో ట్రాప్ చేస్తున్నారు. డబ్బులు లాగిన తర్వాత చెప్పాపెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా  కిలాడీ లేడీల మోసానికి  అనేక మంది మోసపోతున్నారు.

అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ విషయం బయటకు వస్తోందని భయపడి చాలా మంది ఈ తరహా ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తమలో తాము కుమిలిపోతున్నారు. పోలీసులకు చేసే ఫిర్యాదులు చాలా తక్కువగా ఉంటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.


 

click me!