బోర్ వెల్ లారీని ఢీకొన్న కారు: చిన్నారితో సహా ఆరుగురు దుర్మరణం

Published : Dec 02, 2020, 08:20 AM ISTUpdated : Dec 02, 2020, 09:20 AM IST
బోర్ వెల్ లారీని ఢీకొన్న కారు: చిన్నారితో సహా ఆరుగురు దుర్మరణం

సారాంశం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఆరుగురు దుర్మర్మణం పాలయ్యారు. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. కారు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. మృతులు తాడ్ బండ్ కు చెందినవారుగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. గూడూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ పరస్పరం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్