అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్ టాక్స్ అధికారుల ఘాతుకం.. ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపేశారు...

Published : Dec 23, 2021, 11:32 AM IST
అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్ టాక్స్ అధికారుల ఘాతుకం.. ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపేశారు...

సారాంశం

నబీలాల్‌ సదాఫ్‌ ది సహజ మరణం కాదని అధికారులే చంపారని క్లీనర్ చెబుతున్నాడు. ఆ రోజు అధికారులు లోడ్ ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని.. వాహనాన్ని పక్కకు నిలిపి రెండు లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డీసీఎం డ్రైవర్ ట్రాన్స్ పోర్ట్ యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పి 15 వేల రూపాయలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అధికారి దినేష్ కోపోద్రిక్తుడై  నబీలాల్‌ సదాఫ్‌ కాళ్లపై ప్లాస్టిక్ పైపుతో కొట్టాడన్నారు.

తుర్కపల్లి :  sales tax officials వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో dcm driverఅస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. అయితే ఆకస్మికంగా కింద పడి తన తండ్రి చనిపోయినట్లు మృతుడి కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్ టాక్స్ అధికారులు ప్లాస్టిక్ పైప్ తో కొట్టి చంపారని eyewitnessగా ఉన్న డిసిఎం క్లీనర్ అంటున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ననబీలాల్ సదాఫ్ (48) ఏపీ లోని గుంటూరు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు డీసీఎం వ్యాన్ లో సామాగ్రితో బుధవారం వెళుతున్నాడు. తుర్కపల్లి లో భువనగిరికి చెందిన కమర్షియల్ టాక్స్ అధికారులు నబీలాల్‌ సదాఫ్‌ డిసిఎంను ఆపారు. ఆ సమయంలో నబీలాల్‌ సదాఫ్‌ ఆకస్మికంగా కింద పడడంతో ఇతర లారీ  డ్రైవర్లు,  కమర్షియల్ టాక్స్ అధికారులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు నబీలాల్‌ సదాఫ్‌ కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డబ్బులిస్తే ఫేక్ సర్టిఫికేట్స్.. వరంగల్​ కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్స్ రాకెట్.. వీళ్ల తెలివి మాములుగా లేదుగా..

అడిగినంత లంచం ఇవ్వలేదని చంపేశారు.. క్లీనర్
అయితే నబీలాల్‌ సదాఫ్‌ ది సహజ మరణం కాదని అధికారులే చంపారని క్లీనర్ చెబుతున్నాడు. ఆ రోజు అధికారులు లోడ్ ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని.. వాహనాన్ని పక్కకు నిలిపి రెండు లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డీసీఎం డ్రైవర్ ట్రాన్స్ పోర్ట్ యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పి 15 వేల రూపాయలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అధికారి దినేష్ కోపోద్రిక్తుడై  నబీలాల్‌ సదాఫ్‌ కాళ్లపై ప్లాస్టిక్ పైపుతో కొట్టాడన్నారు.

దీంతో నబీలాల్‌ సదాఫ్‌ ప్యాంటు లోనే మూత్రవిసర్జన చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే సేల్స్ టాక్స్ అధికారుల కారులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడని తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House