దిశ నిందితుల ఎన్ కౌంటర్.... సజ్జనార్ ఫోన్ కి కాల్స్ వర్షం

By telugu teamFirst Published Dec 7, 2019, 1:13 PM IST
Highlights

గత వారం రోజుల్లో సజ్జనార్‌ మొబైల్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయంటే ఈ ఘటన తర్వాత ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీస్‌ వర్గాలంటున్నాయి. 

దిశ హత్య కేసులో నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళితే.... నిందితులు అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులపై దాడి చేశారు. దీంతో... ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  అయితే... నిందితులను ఎన్ కౌంటర్ చేసిన క్రెడిట్ అంతా సీపీ సజ్జనార్ కి దక్కింది.

దీంతో... ఆయనపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో... సీపీ సజ్జనార్ ని అభినందించాలని ప్రజలు చాలా ఉత్సాహం చూపించారు. ఎన్ కౌంటర్ తర్వాత మాత్రమే కాదు... ఆయన ఈ కేసును డీల్ చేస్తున్నారని తెలియగానే... ఎన్ కౌంటర్ జరుగుతుందని చాలా మంది ఊహించారట. ఎన్ కౌంటర్ చేయండి సర్ అంటూ... చాలామంది ఫోన్లు, మెసేజ్ లు చేయడం విశేషం. 

గత వారం రోజుల్లో సజ్జనార్‌ మొబైల్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయంటే ఈ ఘటన తర్వాత ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీస్‌ వర్గాలంటున్నాయి. 

ప్రతి నిమిషం ఆయన ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. సీపీ సజ్జనార్‌కే కాదు ఆయన సతీమణి ఫోన్‌కు కూడా వందల సంఖ్యలో మెసేజ్‌లు వచ్చాయని, నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే భావన ఆ మెసేజ్‌ల్లో వ్యక్తమైందని అంటున్నారు.

 అలా ఎస్‌ఎంఎస్‌ లు, వాట్సాప్‌ మెసేజ్‌లు పంపిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సజ్జనార్‌ ఎవరితో చర్చించకుండా రహస్యంగానే ఉంచి ఒత్తిడిని భరించారని పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

click me!