రియల్ మోసాలు : పోలీసుల అదుపులో సాహితీ లక్ష్మీనారాయణ భార్య .. పరారీలో కుమారుడు, డైరెక్టర్లు

Siva Kodati |  
Published : Dec 20, 2022, 08:49 PM IST
రియల్ మోసాలు : పోలీసుల అదుపులో సాహితీ లక్ష్మీనారాయణ భార్య .. పరారీలో కుమారుడు, డైరెక్టర్లు

సారాంశం

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలకు సంబంధించి సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ భార్య పార్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలకు పాల్పడిన కేసులో సాహితీ లక్ష్మీనారాయణ భార్య పార్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ కొడుకు, డైరెక్టర్లు పరారీలో వున్నారు. సాహితి కస్టమర్ల ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో లక్ష్మీనారాయణ జైలులో వున్న సంగతి తెలిసిందే. 

Also REad:రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు.. సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్ , టీటీడీ సభ్యుడి పదవికి రాజీనామా

కాగా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ పేరుతో లక్ష్మీనారాయణ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలా రూ.539 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తన టీటీడీ బోర్డ్ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu