Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్.. ‘వచ్చే ఎన్నికల్లో పోటీ బీజేపీతోనే.. బీఆర్ఎస్‌తో కాదు’

By Mahesh K  |  First Published Jan 25, 2024, 7:07 PM IST

రైతు భరోసా నిధులపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు.
 


Rythu Bharosa: రైతు బంధు విషయమై రాష్ట్రంలో ఇప్పటికీ చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షాలు సహా, రైతుల నుంచి  కూడా అసహనం వెలువడుతున్నది. దీనికితోడు అధికారపక్షం నుంచి కూడా కటువు వ్యాఖ్యలు రావడంతో రైతు భరోసా టాపిక్ హీటెక్కింది. తాజాగా, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఫిబ్రవరి నెల చివరి కల్లా రైతు భరోసా లబ్దిదారుల అందరి ఖాతాల్లో డబ్బులు పడతాయని తెలిపారు.

రాష్ట్రంలో రైతు బంధు లబ్దిదారులుగా ఉన్న 63 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నెలాఖరులోగా డబ్బులు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలో ఉన్న వంద రోజుల్లో అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే తాము రెండు హామీలను అమలు చేశామని వివరించారు. ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు.

Latest Videos

Also Read : Bandla Ganesh: బీఆర్ఎస్ పార్టీ వేరే రాష్ట్రంలో ట్రై చేసుకోవచ్చు.. కేసీఆర్‌కు బండ్ల గణేష్ ఉచిత సలహా

వచ్చే లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య జరిగేవే అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌తో పోటే లేదని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన డేంజరస్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్‌తో పోల్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీశ్ రావులను బిల్లా రంగాలతో పోల్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అందుకే ప్రజలు వారిని గద్దె దింపారని పేర్కొన్నారు.

click me!