వేధిస్తున్నారు, ఆత్మహత్యే శరణ్యం: సీఐ వాట్సాప్ మేసేజ్

By narsimha lodeFirst Published Apr 28, 2019, 5:48 PM IST
Highlights

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేని విధంగా ఉందని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సీఐ దామోదర్ రెడ్డి  వాట్సాప్‌లో మేసేజ్ పెట్టాడు

నిజామాబాద్: ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేని విధంగా ఉందని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సీఐ దామోదర్ రెడ్డి  వాట్సాప్‌లో మేసేజ్ పెట్టాడు. ఈ మేసేజ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని  భావిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

30 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేసినా తనకు బలిదానం తప్పదేమోనని అనిపిస్తోందన్నారు. బలహీన క్షణాలు తనకు భయం కలిగిస్తున్నాయన్నారు.మూడు రోజుల క్రితం ఆయన ఈ మేసేజ్ పెట్టాడు.ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక బలిదానాలు తప్పదేమోనని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ప్రతి క్షణం  వేధింపులతో బతకడం కంటే  ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు. తన చావుతోనైనా కొందరు అధికారులు కళ్లు తెరిస్తే తన జన్మకు అర్ధం  ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రుద్రూర్ సీఐ దామోదర్ రెడ్డి ప్రస్తుతం సెలవులో ఉన్నారు.
 

click me!